భారత్ లో భారీ సంఖ్యలో వాట్సాప్ ఖాతాలపై వేటు.. కొత్త ఫీచర్ వచ్చేసింది..

సెల్వి

శనివారం, 3 ఫిబ్రవరి 2024 (15:01 IST)
ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్ లో భారీ సంఖ్యలో ఖాతాలపై వేటు వేసింది. ఈ ఖాతాలు భారత కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ఐటీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు వాట్సాప్ గుర్తించింది. 2023 డిసెంబరు 1 నుంచి 31వ తేదీ మధ్య 69,34,000 ఖాతాలపై వాట్సాప్ తొలుత ఆంక్షలు విధించింది. సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించిన 69 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ గత డిసెంబరులో నిషేధించింది.
 
డిసెంబరులో వాట్సాప్ కు రికార్డు స్థాయిలో 16,366 ఫిర్యాదులు అందాయి. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు చెందిన వాట్సాప్ కు భారత్ లో 50 కోట్ల యూజర్లు ఉన్నారు. అంతకుముందు, నవంబరులోనూ భారత్ లో 71 లక్షల సమస్యాత్మక ఖాతాలపై వాట్సాప్ వేటు వేసింది. 
 
మరోవైపు... వాట్సాప్‌పై ఫైల్-షేరింగ్ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సమీపంలోని వ్యక్తులతో సులభంగా ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం 'పీపుల్ నియర్‌బై' అనే ఫీచర్ అందుబాటులోకి వస్తోందని, సమీపంలోని వ్యక్తులు సురక్షితంగా ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చని ‘వాబెటాఇన్ఫో’ రిపోర్ట్ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు