గతంలో గూగుల్ పే, ఫోన్ పే అనుసరించిన మార్గానే ఇప్పుడు వాట్సాప్ కూడా అనుసరిస్తోంది. క్యాష్‌బ్యాక్‌లతో వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తోంది. వాట్సాప్ చెల్లింపు సేవ నవంబర్ 2020 నుండి భారతదేశంలో అమలులోకి వచ్చింది.
ఇంత మొత్తం పంపాలన్న నిబంధనలేమి లేవు. 1 రూపాయి కూడా పంపినా రూ.51 క్యాష్‌బ్యాక్ వస్తుంది. పేమెంట్ పూర్తయిన కొద్దిసేపటికే ఈ క్యాష్‌బ్యాక్ మొత్తం అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే, క్యాష్‌బ్యాక్ సదుపాయం గరిష్ఠంగా ఐదుగురికి పంపడానికే వర్తిస్తుంది.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. త్వరలో అందరికీ ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. పేమెంట్ సేవలను ప్రారంభించిన తొలి రోజుల్లో గూగుల్ పే కూడా స్క్రాచ్ కార్డుల రూపంలో క్యాష్‌బ్యాక్ అందించి పెద్ద సంఖ్యలో వినియోగదారులను సొంతం చేసుకుంది. పేటీఎం, ఫోన్ పే సైతం ఇదే దారిలో వెళ్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్ సైతం అదే తరహాలో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ఇండియాలో ఎక్కువ వాడుతున్నారు. భారత్‌లో యూపీఐ ఆధారిత నగదు బదిలీ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ కూడా అదే తరహాలో నడుస్తోంది. క్యాష్‌బ్యాక్ కోసం, వాట్సాప్, గూగుల్ పే వంటి కార్డులను కూడా పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.