మెస్సేజింగ్ యాప్‌లో అగ్రగామి అయిన వాట్సాప్, మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. డిసప్పీయరింగ్ మెస్సేజ్ ఫీచర్‌కు సంస్థ తాజాగా అప్‌డేట్ చేసింది. వాట్సాప్ ఇటీవల ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది యూజర్లు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఇతర ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్‌లకు మారుతున్నారు.
అయితే ఇప్పుడు ఈ సమయాన్ని 24 గంటలకు తగ్గించేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. కొత్త అప్‌డేట్ తరువాత డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్.. 7 రోజులు, 24 గంటలు, ఏదీ కాదు అనే మూడు ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యూజర్లు వాట్సాప్ మెస్సేజ్‌లను 24 గంట్లలో ఆటోమేటిక్‌గా డిలీట్ చేయవచ్చు.
ఈ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్/డెస్క్ వెర్షన్లలో వాట్సాప్ పరీక్షిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిసప్పియరింగ్ ఫీచర్ ప్రకారం 7 రోజుల వరకు మెసేజ్‌లు డిలీట్ అవ్వకుండా ఉంటాయి.