మోజ్‌కు ఏడాది.. టిక్‌టాక్‌కు ధీటుగా దూసుకుపోతోంది.. రేటింగ్‌ 4.2

శుక్రవారం, 2 జులై 2021 (08:26 IST)
Moj
చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ నిషేధించబడిన తరువాత, భారతీయ సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ 2020 జూలై 1న అందుబాటులోకి తీసుకుని వచ్చిన షార్ట్ వీడియో యాప్ మోజ్. India's #1 short video platform అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లోకి వచ్చిన ఏడాదికాలంలో ప్రజల్లో ఈ యాప్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటివరకు ఈ యాప్‌ నెలకు 120 మిలియన్లకుపైగా యాక్టీవ్ యూజర్లతో దూసుకుపోతుంది. ఈ యాప్ పాపులారిటీ నిరంతరం పెరుగుతోంది.
 
ఈ యాప్‌తో సాధారణ వ్యక్తులు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఈ యాప్‌ను సామాన్యులే కాక చాలామంది ప్రముఖులు కూడా ఉపయోగిస్తున్నారు. బాలీవుడ్ తారలు సోనూసూద్, అనన్య పాండే, రెమో డిసౌజా, విజయ్ దేవరకొండ కూడా మోజ్ యాప్‌లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. మోజ్ యాప్‌లో టెక్నాలజీ మరియు కెమెరాల ఉపయోగం కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగిస్తున్నారు. వినియోగదారులకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఇదో గొప్ప అవకాశంగా కనిపిస్తుంది. 
 
మోజ్ యాప్‌లో ఇప్పటివరకు లక్షా 80 వేలకు పైగా పాటల కాపీరైట్ ఉందని, అందువల్ల వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఏదైనా పాటను ఎంచుకుని, దానిపై వీడియోను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రతిరోజూ కోట్ల మంది ప్రజలు ఈ ప్లాట్‌ఫామ్‌లో వీడియోలు చేయడం ద్వారా తమ ప్రతిభను ప్రదర్శిస్తుండగా.. వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 
 
టిక్‌టాక్‌కు ప్రత్యామ్నయంగా షేర్‌చాట్ తీసుకొచ్చిన ఈ 'మోజ్' ఏడాది పూర్తి చేసుకుంది. ఫస్ట్ ఇయర్ యానివర్శిరీ పూర్తి చేసుకున్న ఈ యాప్‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో 4.2 రేటింగ్‌ ఉండగా.. అత్యధిక డౌన్ లోడ్లతో దూసుకుపోతోంది.
 
గడిచిన ఏడాది కాలంలో మోజ్ యాప్‌లో 100బిలియన్ల నిమిషాల కంటెంట్‌ను క్రియేట్ చేశారు. 18 లక్షల మంది బలమైన క్రియేటర్ల కమ్యూనిటీ మోజ్‌లో ఉంది. 75 మిలియన్‌ల కంటెంట్‌ను ప్రతి నెల పోస్ట్ చేస్తున్నారు. టిక్‌టాక్‌లో మాదిరే ఈ యాప్‌లో సొంతంగా వీడియోలు 15 సెకన్ల నిడివితో సృష్టించవచ్చు. ఫిల్టర్లు, స్టిక్కర్లు, ఎమోటికన్లు వంటి ఎఫెక్టులు కూడా ఉన్నాయి. లిప్‌సింకింగ్ అనే ఆప్షన్‌తో సినిమా డైలాగ్స్‌ను టిక్‌టాక్‌లో మాదిరే అనుకరించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు