పట్టణాలకు అందుబాటులో అధునాతన వ్యవస్థ

FileFILE
మొన్నటి వరకు దేశంలోని మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అధునాతన సమాచార వ్యవస్థ ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు సైతం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఎవరూ లేని ఇల్లు, బ్యాంకు, ఆఫీసు, వ్యాపార సంస్థల్లో జరిగే చోరీలు, ఇతర ప్రమాదాలను క్షణాల్లో గుర్తించి కేసులు చేధించే వెసులుబాటు కనిపిస్తుంది.

తాజాగా భారత్ సెక్యూరిటీ సంస్థ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ అధునాతన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసే అలారం ఇంటికి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే మోగుతుంది. వెంటనే 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉండే కంట్రోల్ రూం సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.

వీరు పోలీసులకు సమాచారం అందివ్వడం వల్ల నిందితుల ఆచూకీని సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రమాదాలను నివారించవచ్చు. అంతేకాకుండా.. అపరిచిత వ్యక్తుల ఫోటోలను కూడా తీస్తుంది. దీనివల్ల పోలీసులు పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదు.

వెబ్దునియా పై చదవండి