సీబీఐ ముందు జగన్: ఆర్ఆర్ గ్లోబల్ ఆ 79 కోట్లను సాక్షికే ఎందుకు?
శుక్రవారం, 4 నవంబరు 2011 (10:55 IST)
WD
సీబీఐ ప్రధానంగా సంధించనున్న అస్త్రం ఇదేనని అంటున్నారు. అక్రమ మైనింగ్‌లో వేలకోట్ల రూపాయలను వెనకేసుకున్న గాలి జనార్థన్ రెడ్డి ప్రత్యేకంగా సాక్షి పత్రికలో 79 కోట్ల రూపాయలను ఎందుకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందన్న కోణంలో సీబీఐ జగన్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.
సాక్షిలో పెట్టుబడులకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన పిదప సీబీఐ జగన్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లు చెపుతున్నారు. మొత్తం 100 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని జగన్ ముందు ఉంచనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదిలావుండగా తమ నాయకుడు జగన్ తిరిగి వస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెపుతున్నారు. కొంతమంది జగన్ ను అరెస్టు చేస్తారని లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.