ఇక అసలు విషయానికి వస్తే, నేటితో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వందరోజులకు చేరుకుంది. నంథ్యాలలోని శ్రీరామ థియేటర్ లో వందరోజులు పూర్తి చేసుకోవడంపట్ల హర్షంవ్యక్తం చేస్తూ చిత్ర టీమ్ శుబాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 350 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు సోదరుడు శిరీష్ నిర్మించారు. కాగా, ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోనూ టీవీల్లోనూ కూడా ప్రసారం అయింది. అయినా వందరోజులు థియేటర్లో ప్రదర్శించడం విశేసంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం తమ స్టాప్ కు బోనస్ ప్రకటించినట్లు తెలుస్తోంది. గతంలో అఖండ సినిమా కూడా రాయలసీమలో ఏ థియేటర్ లో వందరోజులు ప్రదర్శించబడింది. ఇప్పటి ట్రెండ్ ను బట్టి థియేటర్ల జనాలు రాకపోవడంతో వెలవెలబోతున్న కొన్ని థియేటర్లు ఇలాంటి అరకొర సినిమాలు ఆడడం విశేషమేగదా..