AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

దేవీ

బుధవారం, 23 ఏప్రియల్ 2025 (11:29 IST)
Vijay, chiru, kashmir photo
జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది ప్రజలను పొట్టనపెట్టుకున్న ఉగ్రదాడిని ఖండిస్తూ తెలుగు చలనచిత్రరంగంలోని ప్రముఖులు ముక్తకంఠంతో సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూన్నారు.అమాయక ప్రజలను మరియు పర్యాటకులను బలిగొన్న దారుణమైన దాడి భయంకరమైనది. ఈ ఘటన హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా హృదయం సానుభూతి తెలియజేస్తుంది. వారు అనుభవించిన నష్టాన్ని ఏదీ పూరించలేదు. నా సంతాపం తెలియజేస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
 
మహేష్ బాబు
పహల్గామ్ దాడితో హృదయం ముక్కలైంది. దయగల హృదయులున్న అందమైన ప్రదేశం. బాధితుల కుటుంబాలందరికీ, వారి బంధువులందరికీ నా సానుభూతి. వారి అమాయక ఆత్మలకు శాంతి చేకూరాలి. నిజంగా హృదయ విదారకం.
 
అల్లు అర్జున్
చీకటి రోజుగా అభిర్ణిస్తున్నా. పహల్గామ్‌లో జరిగిన దాడితో చాలా బాధపడ్డాను. ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా కలిసి నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు,  ప్రార్థనలు కుటుంబాలతో ఉన్నాయి.
 
విజయ్ దేవరకొండ
రెండేళ్ల క్రితం పహల్గామ్‌లో సినిమా షూటింగ్ మధ్య, నవ్వుల మధ్య, మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్న నా స్థానిక కాశ్మీరీ స్నేహితుల మధ్య నా పుట్టినరోజు జరుపుకున్నాను. నిన్న జరిగినది హృదయ విదారకం మరియు కోపం తెప్పించేది - మిమ్మల్ని మీరు ఒక దళంగా చెప్పుకుని పర్యాటకులను కాల్చడం తుపాకుల వెనుక దాక్కున్న మూగ ఉగ్రవాదం చేసిన అత్యంత అవమానకరమైన మరియు పిరికి చర్య.  బాధితులకు మరియు వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము. మేము కాశ్మీర్‌కు అండగా నిలుస్తాము. ఈ పిరికివాళ్ళు తొలగించబడతారని నేను ఆశిస్తున్నాను. త్వరగా ఆ పని పూర్తికావాలని కోరుకుంటున్నానని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు