Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

దేవీ

బుధవారం, 23 ఏప్రియల్ 2025 (10:19 IST)
Devara, salar, kalki posters
తెలుగు సినిమా రంగంలో ప్రస్తుతం సీక్వెల్ గురించి హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో అష్టగ్రహ కూటమి అన్ని రాశులవారికి ఏదో ప్రభావాన్ని చూపుతుంటాయని జాతకాలు చెప్పేవారు తెగ ఊదరగొడుతున్నారు. దాని ప్రభావం సినిమారంగం పై కూడా పడుతుందని కొందరు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సీక్వెల్స్ చేయాలంటే తనకు భయమని అందుకే ఆదిత్య 369, యశోధ చిత్రాలను చేయలేకపోతున్నానని నిర్మాత శివలెంక క్రిష్ణ ప్రసాద్ తేల్చి చెప్పారు.
 
తాజాగా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా సైన్స్ ఫిక్షన్ మూవీగా  గ్రాఫిక్స్‌తో మాయ చేశాడు. అసలు ఆ సినిమా విడుదలకుముందు విడుదలవుతుందో లేదోనని అనిపించింది. అశ్వనీదత్ గారు ప్రోత్సాహంతో ముందుకు సాగామని అన్నారు. సక్సెస్ తర్వాత ఈ చిత్రం పూర్తిగా కల్పితమనీ, పురాణాలను చెప్పేవారెవరినీ సంప్రదించకుండానే సినిమా చేశానని ఘంటాపథంగా చెప్పారు. ఆ తర్వాత కల్కి 2 గురించి చెబుతూ, దానికి సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత ఓ సందర్భంగా ‘కల్కి 2’ చిత్రం రిలీజ్ కావాలంటే 3-4 గ్రహాలు అనుకూలించాలన్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావాలంటే ఏకంగా 7-8 అనుకూలించాలి అని నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో సెటైరిక్ గా మాట్లాడారు. 
 
ఇదిలా వుండగా, ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు, సలార్ 2, దేవర2 సినిమాలకు కూడా గ్రహాలు అనుకూలించాల్సిందేనని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలు నిర్మించే పెద్ద నిర్మాణ సంస్థలు కొంచెంది ఫైనాన్సియల్ ట్రబుల్ లో వున్నాయని విశ్వసనీయ సమాచారం. కనుక ఇప్పుడప్పుడే ఈ సీక్వెల్స్ సెట్ పైకి వెళ్ళకపోవచ్చని రూఢీ అవుతోంది. నాగ్ అశ్విన్ ఒక్కడే చాలా తెలివిగా గ్రహాలపై నెట్టేసి ఇప్పట్లో సీక్వెల్ అయ్యేట్లు లేదని చెప్పేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు