అదే నవ్వు... అదే నమస్కార బాణం... జైలు నుంచి జగన్

మంగళవారం, 25 సెప్టెంబరు 2012 (16:34 IST)
PTI
అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉంటూ జైలులో మగ్గుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలు నుంచి బయటకు తీసుకు వచ్చే సమయంలో ఎప్పట్లానే చిరునవ్వుతో పలుకరిస్తూ తనదైన శైలిలో నమస్కార బాణాలను విసురుతూ కోర్టు వాహనంలోకి ఎక్కారు.

కోర్టుకు వెళ్లిన సమయంలో కోర్టు హాలు వద్ద నిలుచొని వున్న మంత్రి ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణలను చూసి జగన్ చిరునవ్వుతో పలుకరిస్తూ కరచాలనం చేశారు.

ఆ తర్వాత కోర్టు విచారణ అనంతరం తన కుటుంబ సభ్యులతో సుమారు అర్థ గంట పాటు జగన్ మాట్లాడారు. అనంతరం ఆయనను తీసుకొచ్చిన ప్రత్యేక వాహనంలోనే చంచల్‌గూడ జైలుకు తరలించారు.

వెబ్దునియా పై చదవండి