బాలల హక్కులను కాపాడుదాం...!

భారతదేశంలో దాదాపు 30 కోట్లమంది పిల్లల్లో చాలామంది పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లోపించినవారే అధికంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వీరికి ఆర్ధిక, సామాజిక స్ధితిగతుల కారణంగా వారి అభివృద్ధిలో లోపం ఏర్పడుతున్నమాట వాస్తవం. రేపటి జ్ఞానవంతమైన శక్తివంతమైన భారతదేశాన్ని చూడడానికి నేటి బాలల అవసరాలను తీర్చే సమయం ఆసన్నమైంది.

భారతదేశ స్వాతంత్ర్యానంతరం నిశ్చితమైన నిబద్ధతతో కూడిన భారతదేశ రాజ్యాంగం ద్వారా చట్టనిబంధనల ద్వారా బాలల కొరకు అవకాశాలను, కార్యాచరణ విధానాలను మరియు కార్యక్రమాలను భారత ప్రభుత్వం రూపొందించింది.

ఈ శతాబ్దపు చివరి దశకంలో ఆకస్మిక సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య తదితరాంశాలతోబాటు ప్రాదేశిక విషయాలతో నూతన ఆకాంక్షలను కల్పించే అవకాశాలను పిల్లలకు కల్పించడం కోసం భారతప్రభుత్వం పిల్లలకు తోడ్పాటునందిస్తోంది.

భారతదేశంలోగల ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధలు, ఇతర రంగాల వారు కలసి కట్టుగా పని చేయడంలో అసాధారణ సమస్యలు గల బాలలపై ప్రముఖంగా దృష్ఠిని కేంద్రికరించడం.

ఇందులో ముఖ్యంగా పిల్లలు- వెట్టి చాకిరీకి సంబంధించిన అంశాలలో బాల కార్మికుల సమస్యలను పరిష్కరించడం లింగ వివక్షను రూపుమాపడం, వీధి బాలలను ఉద్ధరించడం, ప్రత్యేక అవసరాలుగల బాలలకు కావలసిన అవసరాలను తీర్చడం. అంతే గాకుండా పిల్లలు చదువుకోవడం వారి ప్రాథమిక హక్కుగా ప్రభుత్వం కల్పించింది.

దీనిని ప్రతి ఒక్కరుకూడా కాపాడుకుని వారికి మంచి విద్యాబుద్ధులను చెప్పించి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే మనం చేయవలసిన ప్రథమ కర్తవ్యం.

వెబ్దునియా పై చదవండి