ఆ బాలుడు.. మృత్యుంజయుడు

శుక్రవారం, 13 మార్చి 2009 (10:58 IST)
PTI PhotoPTI
జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఒక అధ్బుతం జరిగింది. వైద్యులకే అంతుచిక్కని విధంగా ఆ బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆరేళ్ళ బాలుని కడుపులోకి పెద్ద ఇనువ చువ్వ (ఇనుప రాడ్) చొచ్చుకుంది. అయితే, ఆ చిన్నారికి మాత్రం ఎలాంటి ప్రాణహాని కలుగలేదు. దీన్ని ప్రత్యక్షంగా చూసిన వైద్యులు నిర్ఘాంత పోయారు. సుమారు నాలుగు అడుగుల పొడవు గల ఇనుప రాడ్ కడుపులో ఒక వైపు నుంచి మరోవైపుకు దూసుకొచ్చింది. (ఫోటోలో ఉన్నట్టుగా).

ఈ ప్రమాదం వల్ల ఆ బాలునికి రక్తస్రావం అయ్యిందేగానీ, ఎలాంటి ప్రాణహాని జరగక పోవడం గమనార్హం. ఆ తర్వాత రాంచీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి, ఇనువ రాడ్‌ను తొలగించారు. ప్రస్తుతం బాలుని ఆరోగ్యం స్థిరంగా, మెరుగ్గా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి