పోస్టుమాన్ ఆట ఆడుకున్నా మమ్మీ..!

"ఏరా చిన్నా... పొద్దుటినుంచి ఎక్కడికెళ్లావు..?" అడిగింది తల్లి

"వీధిలో పోస్టుమాన్ ఆట ఆడుకుంటున్నానమ్మా...!" చెప్పాడు చిన్నా

"పోస్టుమాన్ ఆటకోసం ఉత్తరాలు కావాలి కదరా... మరి వాటినెలా సంపాదించావు..?"

"అందుకే నీ పెట్లో అడుగున ఉన్న ఉత్తరాల కట్ట తీసి అందరికీ పంచి వస్తున్నా మమ్మీ...!"

వెబ్దునియా పై చదవండి