అరయ తరచు కల్లలాడెడు వారిండ్ల..!

FILE
అరయ తరచు కల్లలాడెడు వారిండ్ల
వెడలకేల లక్ష్మి విశ్రమించు
ఓటికుండ నీరువోసిన చందాన
విశ్వదాభిరామ వినుర వేమా...!

తాత్పర్యం :
అదేపనిగా మోసం చేసే వారి ఇళ్లలో సంపద ఎక్కువ కాలం నిలవకుండా వెళ్లిపోతుంది. బీటలువారిన కుండలో నీళ్లుపోస్తే కారిపోయినట్లుగా... మోసం చేసే వారి ఇళ్లలోనూ, అబద్ధాలు చెప్పేవారి ఇళ్లలోనూ ధనలక్ష్మి ఉండబోదని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి మానసిక దారిద్ర్యం, శీల దారిద్ర్యం ధన దారిద్ర్యానికి దారి తీస్తాయని ఈ పద్యం ద్వారా చెప్పాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి