కొండలలో నెలకొన్న కోనేటిరాయడు

FILE
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు


కుమ్మరదాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్రవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు "కొండ"


అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలివెట్టికి నన్ను యోచిననాడు
మచ్చికదొలక దిరుమలనంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చిన వాడు "కొండ"

కంచిలోననుండ దిరుకచ్చినంబి మీద
గరుణించి తనయెడకు రప్పించినవాడు
యెంచి నెరుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు "కొండ"

వెబ్దునియా పై చదవండి