చంప నొంప బువ్వ చాలదా..!

అన్నమధికమైన నదియు తాజంపును
అన్నమంటకున్న ఆత్మనొచ్చు
చంప నొంప బువ్వ చాలదా వెయ్యేల
విశ్వదాభిరామ వినుర వేమా...!

తాత్పర్యం :
తిండి లేక ఒకడు చచ్చిపోతే... తిండి ఎక్కువై మరొకడు చచ్చిపోయాడని సామెత. కాల వ్యవధిని ఇవ్వకుండా, పరిమితి లేకుండా అస్తమానం తినేవాడికి జీర్ణకోశాధి వ్యాధులతో ఆరోగ్యం దెబ్బతిని చావుకు దారి తీయవచ్చు. అన్నం లేనివాడు పోషణ లేక బాధపడతాడు. చంపటానికైనా, కృంగదీయటానికైనా తిండే కారణమని ఈ పద్యం చెప్పాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి