చిన్నారి పొన్నారులం... అమ్మానాన్నల ముద్దులం...!!

చిన్నారి పొన్నారి పిల్లలం
అమ్మానాన్నల ముద్దులం
అవ్వా, తాతల బుడుగులం
సువాసనల మల్లెపూవులం "చిన్నారి"

వెన్నెల బువ్వ తిందామా
కాశీమజిలీ కథలు విందామా
పరవశించి గంతులేద్దామా
పాటలెన్నో పాడుకుందామా "చిన్నారి"

ప్రకృతి అందాలు చూద్దామా
స్వాతి చినుకుల్లో చినుకౌదామా
సీతాకోక చిలుకలవుదామా
సిరి సిరి మువ్వలవుదామా "చిన్నారి"

వెబ్దునియా పై చదవండి