చెమ్మ చెక్క చేరెడేసి మొగ్గ..!!

FILE
చెమ్మ చెక్క చేరెడేసి మొగ్గ
అట్లు పొయ్యంగ, ఆరగించంగ

ముత్యాల చెమ్మచెక్క ముగ్గు లెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క రంగు లెయ్యంగ

పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ

చూచివద్దాం రండి, సుబ్బరాయుడి పెండ్లి
సూర్యదేవుడి పెండ్లి, చూచివత్తాం రండి

మా వాళ్లింట్లో పెండ్లి, మళ్లీ వద్దాం రండి
దొరగారింట్లో పెండ్లి దోచుకు వద్దాం రండి...!!

వెబ్దునియా పై చదవండి