తాత్పర్యం : దశరథునికి ప్రియమైన కుమారుడు, నీలమేఘశ్యాముడు, సీతాదేవికి భర్త, భక్తుడైన హనుమంతుని చేత సేవించబడినవాడు, వాలిని వధించినవాడు, చేతిలో కోదండాన్ని ధరించినవాడు, దశకంఠుడైన రావణుడిని సంహరించినవాడు, దయా హృదయం కలవాడు, భక్తవత్సలుడు అయిన శ్రీరామ చంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను. రామనామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కష్టసాధ్యమైన పనులు కూడా సుళువుగా చేయగలిగిన సామర్థ్యం వస్తుంది.