నలుపు తెలుపు కాదు

ఎలుగుతోలు తెచ్చి యొన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపే కాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా..?
విశ్వదాభిరామ... వినుర వేమా...!!

తాత్పర్యం :
నల్లగా ఉండే ఎలుగుబంటి చర్మాన్ని సంవత్సరంపాటు ఉతికినా, దాని నలుపుపోయి తెల్లగా మారదు. అలాగే ప్రాణం లేని కొయ్యబొమ్మను ఎంతగా కొట్టినా దానిచేత మాటలు పలికించటం సాధ్యం కాదు. అంటే పుట్టుకతో దుర్మార్గుడైన వాడికి ఎన్ని నీతులు బోధించినా, ఎంతగా ప్రయత్నించినా వాడి గుణం మాత్రం మారదని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి