నల్లనివాడు... చల్లనివాడు ఎక్కడున్నాడమ్మా...?!

నల్లనివాడు, చల్లనివాడు ఎక్కడమ్మా...?
మల్లెల మాటున దాగున్నాడో
లేదా అమ్మ కొంగును కప్పుకుని
ఆడుతున్నాడో ఏమో... చూడమ్మా...!

నంద నందనుడు.. నవ్వుల రేడు ఎక్కడమ్మా..?
బృందావనిలో దాగున్నాడో
లేదా చెలియల చుట్టూ చేరి
సయ్యాటలాడుతున్నాడో ఏమో... చూడమ్మా...!

వెన్నదొంగ, కన్నెల దొంగ ఎక్కడమ్మా...?
రేపల్లెలో యశదమ్మ పక్కన
లేదా మిత్రుల తోడ గూడి
వెన్నను దొంగిలించుచున్నాడో ఏమో.. చూడమ్మా...!!

వెబ్దునియా పై చదవండి