నవరస భావాలంకృత...!

FILE
నవరస భావాలంకృత
కవితాగోష్టియును మధుర గానంబును, దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంకూదినట్లు సిద్ధము సుమతీ....!

తాత్పర్యం :
తొమ్మిది రకాలైన శృంగార భావాలతో ఎంతగా కవిత్వం చెప్పినా, సప్త స్వరముల క్రమంలో సంగీతం ఎంత ఇంపుగా పాడినా, తెలివిలేని వానికి ఎంత కష్టపడి ఏమి చెప్పినా... చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు అవుతుందని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి, తెలివితేటలనేవి ప్రతి ఒక్కరికీ అవసరమనీ.. అదే సమయంలో తెలివిలేని వారికి ఎంత చెప్పినా వృధా అవుతుందని అర్థం చేసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి