తాత్పర్యం : తెలివిగలవాడు తనకేమియును తెలియదు అని నిదానంగా మాట్లాడుతాడు. అదే తెలియును అన్నచో వాదించెదరు, అపకీర్తి రావచ్చును. కాబట్టి తెలివిగలవాడు రుషిలాగా మౌనంగా ఉంటాడు. తెలివి తక్కువవాడు అన్నియు తనకు తెలిసినట్లు నటిస్తూ చివరకు అపనిందల పాలవుతాడు. కాబట్టి... తెలివి కలిగినవారెవ్వరూ అతిగా, అనవసరంగా మాట్లాడరని ఈ పద్యం యొక్క భావం.