తాత్పర్యం : ధనంవైపు దృష్టి సారించేవాళ్లు, ధనాన్ని గొప్పగా భావించేవాళ్లు, ధనంపట్ల కోరిక పెంచుకునేవాళ్లు అలా తేలిపోతుంటారుగానీ... ధనాన్ని తృణప్రాయంగా తలచి త్యజించిన వాడిని గురువుగా, తత్త్వాధినేతగా భావించి పూజిస్తారని ఈ పద్యంలో చెప్పాడు వేమన.
కాబట్టి... సంపద పట్ల క్రమక్రమంగా వ్యామోహం పెంచుకునేవారికన్నా... బంగారాన్నీ, మట్టినీ ఒకేలాగ చూసే ఎలాంటి మోహాలు లేనివాడే ఎంతో గొప్పవాడని ఈ పద్యం యొక్క సారాంశం.