పాపమనగ వేరే పరదేశమున లేదు

పాప మనగ వేరె పరదేశమున లేదు
తనదు కర్మములను తగిలియుండు
కర్మ తంత్రిగాక కనుకని యుంటొప్పు
విశ్వదాభిరామ వినుర వేమా..!

తాత్పర్యం :
పాపం ఎక్కడో మరో దేశం నుంచి రాదు. తాను చేసే పనుల ఫలితంగానే వస్తుంది. దుష్ఫలితాలు వచ్చిన తర్వాత శాంతిక్రియలు, మంత్రతంత్రాల వంటి నివారణా చర్యలకంటే ముందుగానే కళ్లు తెరచుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని హెచ్చరిస్తున్నాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి