తాత్పర్యం : పాలు ఇస్తాను, అన్నం పెడతాను తిను నాయనా, రారా అని బతిమలాడితే... కాదు అరటిపళ్లు తీసుకొనిరా, లేకపోతే నేను తినను అంటూ పిల్లలు మారాం చేస్తే.. తల్లిదండ్రులు అలాగే కొని తెచ్చి ప్రేమతో బుజ్జగిస్తూ తినిపిస్తారు. అలాగే భక్తులు మారాం చేసినా భగవంతుడైన నీవు ప్రేమతో మా కోర్కెలను తీరుస్తావు కదా... శ్రీకాళహస్తీశ్వరా...!! అని ఈ పద్యం యొక్క భావం.