తాత్పర్యం : బ్రహ్మదేవుడు ఆయా వస్తువుల యోగ్యతనుబట్టి వాటి గుణగణాలను సృష్టిస్తాడంటారే.. మరి ఇలా చేశాడేంటి? అందంగా లేని పూతగడ్డికి మాత్రం మంచి సువాసననిచ్చి, సుందరమైన బంగారానికి మాత్రం తావిని సమకూర్చలేదే. అది చేసిన చెడ్డ ఏమిటి? పూతగడ్డి చేసిన మంచి ఏంటి? బ్రహ్మ పనులన్నీ ఇలాగే ఉంటాయనీ, ఇదేమీ బాగాలేదని అంటున్నాడు వేమన మహాకవి.