బోడిగుండు మామ.. మామిడిపండు..!

మామా... మా మంచి మామా
మా మామ నెత్తి బోడిగుండు
మామిడిపండు తెమ్మంటే
అల్లం బెల్లం తెచ్చిచ్చిండు

నాకే పెట్టు మామా అంటే
అందరికీ పంచిండు
మామపై కోపం వచ్చి
పరిగెడుతూ పారిపోయా

వెతుక్కుంటూ వచ్చిన మామ
పెద్ద గుండును ఎత్తాడు
మోయలేక ముక్కాడు
కాలుజారి పట్టుదప్పాడు
కర్ర చేతిలో పట్టాడు
హ్హి...హ్హి... హ్హి... హ్హి....!!

వెబ్దునియా పై చదవండి