లక్ష్మి యేలినట్టి లంకాధిపతి

లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి
పిల్లకోతి పౌజు కొల్ల పెట్టె
జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు
విశ్వదాభిరామ వినుర వేమా...!!

తాత్పర్యం :
రావణాసురుడి పట్టణమైన లంకను లక్ష్మీదేవి ఏలినప్పటికీ... అదే లంకను పిల్ల కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టింది కదా... అలాగే, ఎంత బలము గలవాడయిననూ కాలం కలసిరానట్లయితే, ఏమీ చేయలేడని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి