అల్లరి రాజాకు పెద్దల మన్ననలు...!

అల్లరి రాజా వచ్చాడు
పిల్లలందర్ని పిలిచాడు
అల్లరి ఎంతో చేశాడు
గొడవలు ఎన్నో తెచ్చాడు

నాన్నతో తన్నులు తిన్నాడు
అల్లరి అంతా మానాడు
పుస్తకం చేత పట్టాడు
శ్రద్ధగా నాన్నతో వెళ్లాడు

గురువు వద్ద చేరాడు
బుద్ధిగ మాటలు విన్నాడు
చదువులు బాగా చదివాడు
శ్రద్ధగ పాఠాలు విన్నాడు

పాఠాలెన్నో నేర్చాడు
పరీక్షలెన్నో రాశాడు
ఫస్ట్ క్లాసులో నెగ్గాడు
పెద్దల మన్నన పొందాడు...!!

వెబ్దునియా పై చదవండి