కాకమ్మ దాహం తీర్చిన కుండమ్మ..!

కాకమ్మా... కాకమ్మా..
ఎక్కడెక్కడ తిరిగావమ్మా
ఎండలలో అలిసావమ్మా
నీటికోసం వెతికావమ్మా

నీరు ఎక్కడా దొరకదమ్మా
ఏం చేస్తావో చెప్పమ్మా
ఇంటి వెనుక కుండమ్మా
కాకి దాహం తీర్చమ్మా

కాకమ్మా... ఇటు రావమ్మా
కడవ అడుగున నీళ్లమ్మా
పక్కన గులక రాళ్లమ్మా
ఒక్కొక్కటే వెయ్యమ్మా

కుండ అడుగున రాళ్ళమ్మా
కుండ పైపైకి నీళ్ళమ్మా
కడుపునిండా తాగమ్మా
కావు కావుమంటూ ఎగరవమ్మా..!!

వెబ్దునియా పై చదవండి