కుక్క గోవుగాదు.. కుందేలు పులిగాదు..!!

కుక్క గోవు గాదు కుందేలు పులిగాదు
దోమ గజము కాదు దొడ్డదైన
లోభి దాతగాడు లోకంబు లోపల
విశ్వదాభిరామ వినుర వేమ...!

తాత్పర్యం :
ఊరంతా కలియదిరిగే కుక్కను పాలిచ్చే ఆవుతో పోల్చడం కుదరదు. ఆకు కదిలితేనే పారిపోయే పిరికిదైన కుందేలుకు అల్ప ప్రాణులను వేటాడే పులితోనూ పోల్చలేము.

పెద్ద దోమ అయినా, భారీ ఆకారమైన ఏనుగు ముందు అదెంత..? అలాగే పరోపకారి అయిన దానగుణ శీలికి దక్కే గౌరవం.. పిసినారికి దక్కుతుందా...? మంచి ప్రవర్తన వల్లనే లోకంలో ప్రసిద్ధి కలుగుతుందని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి