జీవహింస మహాపాపం

సోమవారం, 15 డిశెంబరు 2008 (11:45 IST)
జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవునరసి కనుడు శివుడె యగును
జీవుడు శివుడనుట సిద్ధంబు తెలియరా
విశ్వదాభిరామ వినుర వేమ...!

తాత్పర్యం :
జీవుడికి, శివుడి మధ్య బేధం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవినీ హీనంగా చూడరాదు. జీవిని చంపడమంటే శివభక్తి తప్పడమేననీ, జీవహింస మహాపాపమని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి