తనుజులనుం గురువృద్ధుల...!

FILE
తనుజులనుం గురువృద్ధుల
జననీజనకులను సాధుజనుల నెవడు దా
ఘనుడయ్యు బ్రోవడో యా
జనుడే జీవన్ర్ముతుండు జగతి కుమారా...!

తాత్పర్యం :
ఓ కుమారా...! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లిదండ్రులను, సజ్జనులైన వారిని.. ఎవడు తనకు చేతనైననూ తగిన సమయంలో రక్షింపలేడో, అలాంటివాడు బ్రతికి ఉన్నప్పటికీ.. చచ్చిపోయిన వారితో సమానమే అవుతుందని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి, అయినవారిని ఆపదలలో రక్షించాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడచుకోవడం ఉత్తమం.

వెబ్దునియా పై చదవండి