తేనెటీగా..! తేనె ఇస్తావా..?

శనివారం, 20 డిశెంబరు 2008 (12:53 IST)
తేనెటీగా..! తేనెటీగా..! తేనె ఇస్తావా?
పువ్వునడుగు.. పువ్వునడుగు.. పుడిశెడిస్తుంది
పువ్వూ, పువ్వూ..! తేనె ఒక్క.. పుడిశెడిస్తావా..?
తీగనడుగు... తీగనడుగు.. దోసెడిస్తుంది

తీగా, తీగా...! తేనె ఒక్క.. దోసెడిస్తావా?
మంచెనడుగు.. మంచెనడుగు.. మానెడిస్తుంది
మంచే, మంచే..! తేనె ఒక్క.. మానెడిస్తావా..?
కంచెనడుగు.. కంచెనడుగు.. కడివెడిస్తుంది

కంచే, కంచే..! తేనె ఒక్క.. కడివెడిస్తావా?
కాపునడుగు.. కాపునడుగు.. పీపాడిస్తాడు
కాపూ, కాపూ..! తేనె ఒక్క.. పీపాడిస్తావా?
పీపాలేదు.. పాపాలేదు.. ఫో.. ఫో.. ఫో..!!

వెబ్దునియా పై చదవండి