దండమయా విశ్వంభర

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:07 IST)
దండమయా విశ్వంభర
దండమయా పుండరీకలదళనేత్ర హరీ
దండమయా కరుణానిధీ
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా...!

తాత్పర్యం :
సమస్త జగములను నీయందు ఉంచుకొనినవాడా.. తెల్ల తామర రేకుల్లాంటి కన్నులు గలవాడా.. శ్రీహరీ.. కరుణా సముద్రుడా.. నీకు ఎల్లవేళల యందునూ నమస్కరింతును తండ్రీ...!

వెబ్దునియా పై చదవండి