పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజ ఒకటి దర్శనములు వేరు దైవంబు ఒక్కటి విశ్వదాభిరామ... వినుర వేమా..!!
తాత్పర్యం : ఆవు మొదలైన పశువులు వేరు, వేరు రంగుల్లో ఉండవచ్చుగానీ... అవి ఇచ్చే పాల రంగు మాత్రం ఒక్కటే. అదే విధంగా ఎన్నిరకాల పువ్వులు ఉన్నా, వాడేది పూజకే. భక్తుడు చూసే చూపులు ఎన్ని ఉన్నా, దైవదర్శనం మాత్రం ఒక్కటే.. కాబట్టి మానవులందరూ ఒక్కటేనని గ్రహించి, సమభావంతో కలసి మెలసి జీవించాలని ఈ పద్యంలో చెప్పాడు వేమన.