పసిబాలుని వలె ఉంటివి గదా కృష్ణా...!

పాణితలంబున వెన్నయు
వేణికిమూలంబునందు వెలయగ ఫించం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుడ కృష్ణా...!

తాత్పర్యం :
ఓ కృష్ణా...! నీవు లోకములకెల్ల ప్రభుడవయ్యా.. చేతిలో వెన్నముద్దయు, సిగలో నెమలి ఫించమును, ముక్కున ఆణిముత్యమును ధరించి పసిబాలుడిలాగా ఉంటివి కదయ్యా...!!?

వెబ్దునియా పై చదవండి