పాపాయి కన్నులు కలువరేకులు

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:08 IST)
పాపాయి కన్నుల్లు కలువరేకుల్లు
పాపాయి జుంపాలు పట్టుకుచ్చుల్లు

పాపాయి దంతాలు మంచిముత్యాలు
పాపాయి చేతులు పొట్లకాయల్లు

పాపాయి పిక్కలు మొక్కజొన్న పొత్తులు
పాపాయి చెక్కిల్లు పసివెన్నముద్దలు

పాపాయి వన్నెల్లు పసినిమ్మపండుల్లు
పాపాయి పలుకులు పంచదార చిలకల్లు
పాపాయి చిన్నెలు బాలకృష్ణుని వన్నెల్లు...!

వెబ్దునియా పై చదవండి