పెట్టిపోయలేని పట్టి నరులు భూమి బుట్టనేమి వారు గిట్టనేమి పుట్టలోన జెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినుర వేమ..!
తాత్పర్యం : దానధర్మాలు ఏ మాత్రం చేయలేనట్టి మనుషులు పుట్టినా, చనిపోయినా ప్రయోజనం లేదు. ఎలాగంటే... చెద పురుగులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి కదా..? వాటి వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అలాగే... దానధర్మాలు చేయలేనట్టి వారి వల్ల కూడా ఈ ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఈ పద్యం యొక్క భావం.