పేరు ధర్మరాజు పెను వేప విత్తయా...!

కులము నీరుజేసే గురువును జంపించె
పొసగ యేనుగంత బొంకు బొంకె
పేరు ధర్మరాజు పెను వేప విత్తయా
విశ్వదాభిరామ... వినుర వేమా...!!

తాత్పర్యం :
ధర్మరాజు... ఏనుగంత అబద్ధం ఆడటం వల్లనే కురువంశం దగ్ధం కావడానికి కారణమయ్యాడు. గురువు ద్రోణాచార్యుడి మరణానికి హేతువయ్యాడు. పేరు ధర్మరాజే అయినా ఆయనలో ఉన్నది అసత్యపు చేదు. వేపలో ఎన్ని సుగుణాలున్నా, ఒక్క చేదువల్లనే దానికాపేరు వచ్చింది. అలాగే, ఎంతోగొప్పవాడైన ధర్మరాజు, అబద్ధం అనే మచ్చవల్ల వివాదాస్పదుడయ్యాడని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి