లాలీ లాలమ్మ... లాలీ లాలమ్మ...!!

లాలీ లాలమ్మ.. లాలీ లాలమ్మ
లాలమ్మ గుర్రాలు... లంకల్లో మేసే

బుల్లెమ్మ గుర్రాలు... బీడుల్లో మేసే
అప్పన్న గుర్రాలు... అడవుల్లో మేసే

ఉరుకో అబ్బాయి... వెర్రి అబ్బాయి
ఉగ్గెట్టు మీయమ్మ... ఊరికెళ్లింది

పాలిచ్చు మీయమ్మ... పట్నమెళ్లింది
నీరోసే మీయమ్మ.... నీళ్ళకెళ్ళింది
లాలీ లాలమ్మ... లాలీ లాలమ్మ...!!

వెబ్దునియా పై చదవండి