సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు దేశవ్యాప్తంగా ఆయా స్థానాల్లో ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండో దశ పోలింగ్‌లో భాగంగా గురువారం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు 12 రాష్ట్రాల్లో 95 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రెండో దశ ఎన్నికల్లో మొత్తం 427 మంది కోటీశ్వరులు పోటీ పడుతున్నారు. వీరిలో 27 శాతం అభ్యర్థులు రూ.కోటికిపైగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొనగా..11 శాతం మంది రూ.5 కోట్లపైన, 41 శాతం మంది అభ్యర్థులు రూ.10 లక్షల్లోపు ఆస్తులున్నట్లు పేర్కొన్నారు.
అయితే, భారీ ఎత్తున నగదు పట్టుబడటంతో తమిళనాడులోని వేలూరు స్థానానికి పోలింగ్‌ను ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 15,79,34,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1629 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రేపటి పోలింగ్ సందర్భంగా బరిలో ఉన్న కొందరు కీలక నేతలు వీరే...