రాహుల్ గాంధీ 25 కోట్ల మంది ప్రజలకు సూపర్ ఆఫర్... అరుణ్ జైట్లీ ఫైర్

మంగళవారం, 26 మార్చి 2019 (16:46 IST)
కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకంపై విధివిధానాలను ప్రకటించింది. ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటైన కనీస ఆదాయ పథకంపై దేశంలోని 25 కోట్ల మంది పేదలకు కనీస ఆదాయం అందిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. దేశంలోని 20శాతం మందికి కనీస ఆదాయం అందిస్తామని.. ఇందులో భాగంగా మినిమం ఇన్ కమ్ లైన్‌ను రూ.12వేలుగా నిర్ణయించామన్నారు. 
 
ఆలోపు ఆదాయం ఉన్నవారికి పథకం అమలు చేస్తామన్నారు. సగటున ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.72వేలు అందిస్తామని ప్రకటించారు. ఆ లెక్కన ఒక్కో కుటుంబానికి నెలకు 6వేల వరకు అందే అవకాశముంది. కనీస ఆదాయం పథకంతో దేశంలోని 5 కోట్ల పేద కుటుంబాల్లోని 25కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందడం జరుగుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఈ పథకం ఎక్కడా లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే.. కనీస ఆదాయ పథకాన్ని హిందీలో న్యూన్ తమ్ ఆయ్ యోజన(ఎన్‌టీఏవై)గా పిలుస్తున్నారు. తానేమీ మహాత్ముడిని కావాలనుకోవడంలేదన్నారు. మోదీలాగా దేశాన్ని మాత్రం రెండుగా విభజించాలనుకోవట్లేదన్నారు. 
 
అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన కనీస ఆదాయ పథకంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పేద ప్రజలకు రాహుల్ గాంధీ బూటకపు కలలను చూపిస్తున్నారని ఆరోపించారు. గతంలో మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు గరీబి హటావో అన్నప్పటికీ ఏమీ జరగలేదన్నారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ.దేశంలో పేదరికం కాంగ్రెస్ వారసత్వమేనని జైట్లీ వ్యాఖ్యానించారు. 
 
దేశంలో 20శాతం మంది రూ.12వేల ఆదాయం లేని వారనుకుంటే దేశంలోని పేదలను వదిలించుకునేందుకే కాంగ్రెస్ ఈ పథకాన్ని తెరపైకి తెచ్చిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.

దేశంలో చాలామంది పారిశ్రామిక కార్మికులు  రూ.12వేల కంటే ఎక్కువగా ఆదాయం పొందుతున్నారు. ఏడోవ సీపీసీ తర్వాత ప్రభుత్వంలో కనీస ప్రారంభ వేతనం నెలకు రూ.18వేలని జైట్లీ గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో భూమిలేని పేదలు, ఎంఎన్ఆర్ఇజిఎ చెల్లింపును పొందుతారు. కార్మిక కనీస వేతనాలు 42 శాతం పెరిగిందని జైట్లు తెలిపారు. 
 
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1971లో 'గరీబి హటావో' అనే నినాదం ద్వారా కేవలం పేదరికాన్ని పునఃపంపిణీ చేసారని.. భారతదేశంలో పేదరికపు వారసత్వం కాంగ్రెస్ పార్టీ అసమర్థమైన పాలన, ఆర్థిక నమూనాను ప్రతిబింబిస్తుందని జైట్లీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు