71 యేళ్ల వయసులో తొలిసారి ఓటు వేయనున్న వృద్ధుడు.. ఎక్కడ?

ఠాగూర్

ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (11:12 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో అన్సారీ అనే వృద్ధుడు 71 యేళ్ల వయసులో తన ఓటు హక్కును తొలిసారి వినియోగించుకోనున్నాడు. రాష్ట్రంలోని సాహిబ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. 1953లో జన్మించినప్పటికీ ఇప్పటివరకూ ఆయన ఒక్కసారి కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీనికి కారణం ఆయన పేరు ఒక్కసారిగా కూడా ఓటర్ల జాబితాలో చేర్చలేదు. సాహిబ్‌గంజ్ జిల్లా బాడ్ఖోరీ గ్రామానికి చెందిన ఖలీల్ అన్సారీ 1953 జనవరి ఒకటో తేదీన అంటే భారత తొలి లోక్‌‍సభ ఎన్నికలు జరిగిన యేడాది తర్వాత జన్మించారు. కంటి చూపునకు నోచుకోని అన్సారీ ఇప్పటివరకూ ఒక్కసారిగా కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. 
 
ప్రభుత్వ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా, జార్ఖండ్ ప్రధాని ఎన్నికల అధికారి కె.రవికుమార్ ఇటీవల అన్సారీ ఉంటున్న గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధుడి విషయం ఆయన దృష్టికి వచ్చింది. తనిఖీల సందర్భంగా అన్సారీ పేరు ఎక్కడా ఓటర్ల లిస్టులో కనపడలేదని కుమార్ తెలిపారు. దీనర్థం.. అన్సారీ ఇప్పటివరకు ఒక్కసారిగా కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదని ఆయన అన్నారు. మరోవైపు, తొలిసారిగా ఓటు వేసే అవకాశం దక్కినందుకు అన్సారీ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం దేశంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, జూన్ 1వ తేదీన జరిగే పోలింగ్‌లో ఆయన రాజ్‌మహాల్ లోక్‌సభ స్థానం పరిధిలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు