తెలంగాణ ఎన్నికలు : ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం

గురువారం, 23 మే 2019 (15:28 IST)
కాంగ్రెస్ తురుపుముక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణాలోని మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన రాజశేఖర్‌పై 6270 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. 
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే భువనగిరి, నల్గొండ స్థానాలను కైవసం చేసుకుంది. ఇపుడు రేవంత్ రెడ్డి కూడా విజయం సాధించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు స్థానాల్లో గెలుపొందినట్టయింది. 
 
నిజానికి గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి .. అటు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కో రౌండ్‌లో ఒకరు ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. దాంతో ఎవరిని విజయం వరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని విజయం వరించడంతో, ఆయన అభిమాన గణం ఊపిరి పీల్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు