అందుకనే అంత సంతోషం

భార్యభర్తలిద్దరూ కలిసి ఊరెళ్లడానికి బస్‌స్టాప్‌కి వెళ్లారు...

"ఏంటండీ మొహం అలా మాడ్చుకుని అలా దిక్కులు, చూస్తున్నారు. అటు చూడండి, వాళ్ల భార్యలతో ఎంత సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నారో..!" అంటూ రుసరుసలాడింది భార్య.

"అబ్బే అదేంకాదు.. నువ్వు పొరబాటు పడినట్టున్నావ్..‌! వాళ్లు భార్యలతో కలిసి ఊరెళ్లడం లేదు, వాళ్లను దిగబెట్టేందుకు మాత్రమే వచ్చారు. అందుకనే అంత సంతోషం..!" విచారంగా చెప్పాడు భర్త.