పార్కులో కూర్చున్న ఓ ఇద్దరు ప్రేమికులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కనున్న జంటను చూడు... ఆ అమ్మాయి ఏం అడిగినా ఆ అబ్బాయి ఠక్కున ఎలా తెచ్చి ఇస్తున్నాడో అంటూ ప్రియుడ్ని అడిగింది ప్రేయసి.
అదేం అంత గొప్ప ఆ అమ్మాయికి ఏం కావాలో నన్ను అడగమను... నేనూ క్షణాల్లో తెచ్చిస్తా... అంటూ అందమైన ఆ అమ్మాయి వంక అదోలా చూస్తూ నోరు జారాడు ప్రేమికుడు.