ఇలాంటివి చాలా ఖర్చు చేశాడులేవే..!!

ఇద్దరమ్మాయిలు బజారులో వెళుతున్నారు. ఇంతలో ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు.

బిచ్చగాడు : అమ్మా... కొంచెం దయ చూపించండి

ఒకమ్మాయి అతని జోలెలో వంద రూపాయల నోటు వేసింది.

రెండో అమ్మాయి : ఏమే ఎందుకంత వేశావంటూ ఆశ్చర్యంగా అడిగింది.

మొదటి అమ్మాయి : పాపం అతను ఇంతకు ముందు ఇలాంటి నోట్లు నా కోసం చాలా ఖర్చు చేశాడులేవే....!!

వెబ్దునియా పై చదవండి