నేనే చేసుకున్నా

గురువారం, 7 ఆగస్టు 2008 (16:45 IST)
ఈ మధ్య బాగా ఎర్రగా దబ్బపండులా ఉండే ఓ అమ్మాయితో పార్కుల వెంట, బీచ్‌ల వెంటా తిరుగుతూ ఉండేవాడివి. ఇంతకీ ఆ అమ్మాయి నీ లైన్‌లోకి వచ్చిందా అంటూ స్నేహితున్ని ప్రశ్నించాడు సురేష్.

ఆ... వచ్చింది అంటూ చెప్పాడు రాజేష్.

మరి నీ పక్కన ఇప్పుడు ఆ అమ్మాయి కన్పించడం లేదేంటి అంటూ మళ్లీ ప్రశ్నించాడు సురేష్.

ఆ అమ్మాయికి పెళ్లైపోయింది అంటూ చెప్పాడు రాజేష్.

ఎవర్తో అంటూ ఆత్రంగా అడిగాడు సురేష్.

నాతోనే... అంటూ చల్లగా చెప్పాడు రాజేష్.

వెబ్దునియా పై చదవండి